Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవడంతో తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభించినట్టయిందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ 5 స్థానాల్లో గెలుపొందిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆప్‌ను జాతీయ పార్టీ స్థాయికి తేవడంలో సహకరించిన గుజరాత్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టప్రకారం తమ పార్టీ జాతీయ స్థాయి హోదా పొందడానికి గుజరాత్ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్య సరిపోతుందని వ్యక్తం చేశారు.
దేశంలో జాతీయ స్థాయి హోదా పొందిన పార్టీలు చాలా కొద్దిగా ఉన్నాయి. ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీ హోదా కేటగిరిలో చేరిందని, పదేళ్ల క్రితం ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉందని, గుజరాత్ ఎన్నికలతో తమ పార్టీ జాతీయ హోదాకు చేరిందని అన్నారు. బీజేపీకి కంచుకోట గుజరాత్ అని చెబుతుంటారు. 13 శాతం ఓట్లు సాధించడం ద్వారా ఆ కంచుకోటకు బీటలు పడేలా చేశాం. 39 లక్షలకు పైగా ఓట్లు గెలిచాం. మా పార్టీ ఎంతగా ప్రజల విశ్వాసం చూరగొందనేది సాధించిన ఓట్ల శాతం ప్రతిబింబిస్తోందన్నారు.