Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. అధికార బీజేపీ 156 స్థానాలతో విజయభేరి మోగించింది. గత ఎన్నికల్లో 99 సీట్లకే పరిమితమైన బీజేపీ, ఈసారి తిరుగులేని విజయాలతో కాంగ్రెస్ ను మట్టికరిపించింది. కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు దక్కగా, తొలిసారి గుజరాత్ బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాలు చేజిక్కించుకుంది. ఇతరులు 4 స్థానాల్లో నెగ్గారు.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 92. అయితే మ్యాజిక్ ఫిగర్ ను మధ్యాహ్నానికే దాటేసిన బీజేపీ సాయంత్రానికి 150కి పైగా స్థానాలతో జయకేతనం ఎగురవేసింది. అంతే కాకుండా హిమాచల్ ప్రదేశ్ లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజేతగా నిలబడింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 68 వాటిలో ఈ సాయంత్రానికి ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, కాంగ్రెస్ 40 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీకి 25, ఇతరులకు 3 స్థానాలు దక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కస్థానం కూడా నెగ్గలేకపోయింది.