Authorization
Sat May 17, 2025 03:01:02 am
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
నూతన అక్బర్ పేట్ భూంపల్లి మండలంలోని కూడవెళ్లి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలోని హుండీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. గురువారం ఉదయం ఆలయ అర్చకుడు సంకేత శర్మ ఆలయానికి వచ్చి చూడగా హుండీ కనపడకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దీంతో ఆలయ అర్చకుడు భూంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. గత తొమ్మిది నెలలుగా ఆలయ హుండీ తెరవకపోవడంతో ఎంత నగదు ఉందో తెలియదని అర్చకులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు సంకేత శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు.