Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించనున్న తరుణంలో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు స్పందించారు. నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరింది. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రప్రభుత్వం కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్‌లు దేశానికి రోల్ మోడల్, ఆదర్శమని తెలంగాణను ఎన్నోసార్లు అభినందించారు. నేడు అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్పును దృవీకరించడం సంతోషకరం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగేద్దాం అని హరీశ్‌రావు తన ట్వీట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.