Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగూడెం: గంజాయి కేసులో ముద్దాయికి రెండేళ్ల జైలు, రూ.20 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం ఒకటో అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఎం.శ్యామ్‌శ్రీ గురువారం తీర్పుచెప్పారు. వివరాలిలా ఉన్నాయి. 2018, సెప్టెంబరు 15న ముందస్తు సమాచారంతో ఖమ్మం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్సై సర్వేశ్వరరావు తన బృందంతో కలిసి ఇల్లెందు సుభాష్‌చంద్రబోస్ నగర్‌లోని కె.లీల ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. మూడు కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. లీలపై స్థానిక ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులను విచారించగా నిందితురాలిపై నేరం రుజువైంది. దీంతో పై విధంగా తీర్పు ఇచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కుమ్మరి రామారావు, లైజన్ ఆఫీసర్లుగా ఎన్.వీరబాబు, కోర్టు పీసీ నర్సింహాచారి సహకరించారు.