Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి శుక్రవారం తెరలేవనుంది. మెట్రో రెండో దశలో భాగంగా... రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపడుతున్న పనులకు భూమి పూజ జరగనుంది. ఈ కారిడార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.6,250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల పొడవున ఈ లైన్‌ను నిర్మిస్తారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉదయం 10 గంటలకు భూమి పూజ చేసిన అనంతరం, తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు.