Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: స్థానిక తాంబరం సమీపంలోని మరమలైనగర్‌లో రైలు పట్టాలపై కూర్చొని మాట్లాడుకుంటున్న ఓ ప్రేమ జంట రైలు ఢీకొని మృతి చెందింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా... కడలూరు జిల్లాకు చెందిన అలెక్స్ (24), తూత్తుకుడి జిల్లాకు చెందిన షెర్లిన్ (20) మరమలైనగర్‌లో ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. రెండు కుటుంబాల అనుమతితో వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. వీరు చెంగల్పట్టు జిల్లా సింగపెరుమాళ్ ఆలయ ప్రాంతంలో వేర్వేరుగా అద్దె ఇళ్లలో నివశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బుధవారం రాత్రి మరమలైనగర్ ప్రాంతంలో ఉన్న రైలుపట్టాలపై కూర్చొని మాటల్లోపడ్డారు. అదే సమయంలో ఎగ్మూర్ నుంచి వెళ్తున్న ఎక్స్‌ప్రె్‌సను గమనించిన ప్రేమజంట పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆలోపే వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొనడంతో అక్కడికక్కడే వారు దుర్మరణం చెందారు. దీనిపై చెంగల్పట్టు రైల్వే పోలీసులు కేసు నమోదుచేసుకొని, మృతదేహాలను చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమ జంట రైలు ఢీకొనడం వల్ల ప్రమాదవశాత్తు మరణించారా, లేకుంటే ఇద్దరి మధ్య విభేధాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.