Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ అహ్మదాబాద్: గుజరాత్ ప్రజలు బీజేపీ వరుసగా ఏడోసారి అధికారాన్ని సొంతం చేసుకున్నది. నమోదైన మొత్తం ఓట్లలో 53 శాతానికి పైగా ఓట్లు ఆ పార్టీకే పడ్డాయి. అయితే రాష్ట్రంలో నోటాకు కూడా భారీగా ఓట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,01,202 మంది ఓటర్లు తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని తీర్పునిచ్చారు. ఇది మొత్తం నమోదైన పోలింగ్ శాతంలో 1.5 శాతం. కాగా, ఈ సారి అత్యధికంగా ఖేడ్‌బ్రహ్మ నియోజకవర్గంలో 7331 ఓట్లు నోటాకు వచ్చాయి. ఇక డాంటాలో 5213 ఓట్లు, ఛోటా ఉదయ్‌పూర్‌లో 5093, దేవ్గధ్‌బారియాలో 4821, షెహ్రాలో 4708, నైజర్‌లో 4465, బర్డోలిలో 4211, వడోదరా సిటీ నియోజకవర్గంలో 4022 ఓట్లు నోటా వచ్చాయి.