Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: వరుడు ముక్కు చిన్నగా ఉందని.. పెళ్లే ఇష్టం లేదని ఖారాకండిగా చెప్పిందో వధువు. ఈ ఊహించని సంఘటన యూపీలోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరుడి కుటుంబం వధువు ఇంటికి బుధవారం ఊరేగింపుగా వచ్చింది. దీంతో అమ్మాయి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇంతలోనే అక్కడ ఉన్న కొంత మంది మహిళలు వరుడి ముక్కు చాలా చిన్నగా ఉందని గుసగుసలాడుకున్నారు. అది కాస్తా ఆనోట.. ఈ నోట విన్న వధువు అతడిని చూసేందుకు వెళ్లింది. నిజంగానే ముక్కు చిన్నగా ఉందని వెంటనే పెండ్లికి నిరాకరించింది. అతడి ముక్కు చిన్నగా ఉంది కాబట్టి తాను పెండ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు ఆమెను ఒప్పించేందుకు ఎవరెంత ప్రయత్నించినా.. తన నిర్ణయాన్ని మాత్రం ఆమె మార్చుకోలేదు.