Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌పై ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టులో కేసులు దాఖలు చేస్తున్నారు. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత.. ఆ సోషల్ మీడియా సైట్‌లో పనిచేస్తున్న సుమారు 7500 మంది ఉద్యోగులను మస్క్ తొలగించిన విషయం తెలిసిందే. అయితే తొలగింపులను ప్రశ్నిస్తూ మాజీ ఉద్యోగులందరూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఆఫీసు రూమ్‌లను బెడ్‌రూమ్‌లుగా మారుస్తున్నట్లుగా కూడా మస్క్‌పై శాన్ ఫ్రాన్సిస్‌కోలో కేసు నమోదు అయ్యింది. ముందుగా మస్క్ హామీ ఇచ్చినట్లు తమకు నష్టపరిహారం అందడం లేదని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. కంపెనీకి కట్టుబడి పనిచేయాలని మస్క్ ఇచ్చిన అల్టిమేటమ్‌ను ప్రశ్నిస్తూ మరికొందరు కేసులు దాఖలు చేస్తున్నారు. 60 రోజుల వార్నింగ్ టైమ్ ఇవ్వకుండానే తమను ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఆయనపై కేసులు బుక్ చేస్తున్నట్టు వారు వాపోతున్నారు.