Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ అస్సాం: ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు.. గురువారం రాత్రి కర్బి అంగ్‌లాంగ్ జిల్లాలో వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 30 వేల యాబా టాబ్లెట్‌లతోపాటు, రూ.7 కోట్ల విలువచేసే హెరాయిన్‌తో కూడిన 55 సోప్ కేసులు లభ్యమయ్యాయి. దాంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఈ డ్రగ్స్‌ను తరలిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.