Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదేండ్లలలో విదేశీ పర్యటనలకు రూ.225 కోట్లు ఖర్చు చేశారు. ఈ మేరకు రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ ఎలమరం కరీం అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఐదేండ్లలలో ప్రధాని మోడీ 36 విదేశీ పర్యటనలు చేశారని, అయితే అందులో 29 విదేశీ పర్యటనలకు రూ.225,00,23,925 ఖర్చు జరిగినట్లు తెలిపారు. 36 పర్యటనల్లో 11 పర్యటనల్లోనే ప్రధానితో పాటు విదేశీ వ్యవహారాల మంత్రులు ఉన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దావలే అన్ని పర్యటనల్లో ప్రధాని మోడీతో ఉన్నారు.