Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ విశాఖపట్నం: విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రాయఘడ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగే సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన ఎం.శశికళ(19) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. కాకినాడ జిల్లా అన్నవరం ప్రాంతానికి చెందిన ఆమె దువ్వాడ విజ్ఞాన్ కళాశాలలో ఎంసిఎ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రోజూ ఇంటి నుంచి కళాశాలకు రైలుతో రాకపోకలు సాగిస్తుండేది. బుధవారం రైలు ఆగే సమయంలో ఆమె ప్రమాదానికి గురైంది. రైల్వే రెస్క్యూ టీమ్ గంటన్నరసేపు శ్రమించి ప్లాట్‌ఫాం వద్ద రెండు బ్లాకులను తొలగించి అతికష్టం మీద ఆమెను బయటకు తీశారు. చికిత్స కోసం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నడుము భాగంలోని అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతర్గత రక్తస్రావం కూడా అవడంతో కోమాలోకి వెళ్లింది. వైద్యులు ఆమెను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.