Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ నందిగామ: పొగమంచుతో రోడ్డు కనిపించక బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున నందిగామ తోటచర్ల వద్ద చోటుచేసుకుంది. నందిగామ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొప్పు భాస్కర్ ఏకైక కుమారుడు వంశీ కృష్ణ (22), తన స్నేహితుడు దినేష్‌తో కలిసి తెల్లవారుజామున హైదరాబాద్ నుండి నందిగామకు బైక్ పై బయలుదేరారు. పొగమంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో తోటచర్ల వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్ర రక్తస్రావమయ్యి వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. దినేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దినేష్‌ను చికిత్స కోపం వెంటనే నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. వంశీ కృష్ణ మృతి వార్త విన్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు. భాస్కర్‌కు వంశీ ఒకే కుమారుడు కావటంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.