Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ప్రయివేటుకు దీటుగా గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. గిరిజన బిడ్డలను విద్యావంతులను చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడకముందు 91 గిరిజన గురుకులాలు మాత్రమే ఉండేవని, తమ ప్రభుత్వం మరో 92 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ సీట్లు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు మంత్రి అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే గిరిజనుల్లో అక్షరాస్యత శాతం ఇప్పుడు అత్యధికంగా పెరిగిందన్నారు. గిరిజనులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు.