Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతించకపోవడంతో ట్యాంక్ బండ్ వద్ద షర్మిల దీక్ష భగ్నం..అరెస్ట్ చేసిన పోలీసులు ఆమరణదీక్షకు దిగారు. ఈ తరుణంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చారు. దీంతో షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు అక్కడకు పెద్ద సంఖ్యలో వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో షర్మిల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు.
తన పాదయాత్రను ఆపేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని, తన పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఉన్నా, అయినప్పటికీ కేసీఆర్ న్యాయస్థానాన్ని కూడా అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. పాదయాత్ర చేస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్టీపీ అంటే భయం లేకపోతే పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని, ఇప్పటికే 85కు పైగా నియోజకవర్గాలను దాటొచ్చామని. ఇప్పుడు తమకు అడుగడుగునా ఎందుకు ఆటంకాలు కల్పిస్తున్నారని ప్రశ్నించారు.
అయితే తరుణంలో తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు అనుమతి లేదంటూ దీక్షను అడ్డుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షలో కూర్చున్న షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన కార్యకర్తలను పక్కకు తోసేసి ఆమెను తీసుకెళ్లారు. ఈ క్రమంలో షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర ఆరోపనలు చేశారు.