Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీలో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాల్కర్‌ను ఆమె భాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ అత్యంత దారుణంగా చంపిన ఘటనపై శ్రద్ధా తండ్రి వికాశ్ వాల్కర్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతుర్ని చంపిన అఫ్తాబ్‌కు కూడా శిక్ష వేయాలని వికాశ్ డిమాండ్ చేశారు. శ్రద్ధా హత్య ఘటన పట్ల విచారణ చేపట్టాలని, అతనికి ఉరివేయాలని వికాశ్ కోరాడు. ఈ మర్డర్‌లో అఫ్తాబ్ ఫ్యామిలీ పాత్ర కూడా ఉండి ఉంటుందని, ఆ కోణంలోనూ విచారణ చేపట్టాలని వికాశ్ డిమాండ్ చేశారు.
18 ఏళ్లు దాటిన పిల్లల్ని కంట్రోల్‌లో పెట్టాలని, వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేసులో విచారణ జరుగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురు శ్రద్ధాను దారుణంగా మర్డర్ చేశారన్నారు. వాసాయి పోలీసుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నానని, ఒకవేళ ఆ పోలీసులు హెల్ప్ చేసి ఉంటే, అప్పుడు తన కూతురు ప్రాణాలతో ఉండి ఉండేదని వికాశ్ వాల్కర్ మండిపడ్డారు.