Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కడప స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ మలి దశ ఉద్యమాన్ని ప్రారంభించింది. దీనిని జమ్మలమడుగు వద్ద ఉన్న ఉక్కు పరిశ్రమ శిలాఫలకం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రారంభించారు.
ఈ తరుణంలో నారాయణ మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ శిలాఫలకాలకే పరిమితమైందని, ఏ అదానీకో, మరెవరికో అప్పగిస్తే వారైనా ఈ పరిశ్రమను పూర్తిచేస్తారని సలహా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానిని జగన్ ఎందుకు నిధులు అడగడంలేదని నారాయణ ప్రశ్నించారు. సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేయలేని వ్యక్తి రెండు రాష్ట్రాలను కలుపుతానంటూ మాయమాటలు చెబుతున్నాడని మండి పడ్డారు.