Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఫ్రాన్స్ ప్రభుత్వం దేశంలోని యువతకు ఫ్రీగా కండోమ్‌లు అందించినునట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచే యువత దేశంలోని ఫార్మసీల ద్వారా ఉచిత కండోమ్ లను తీసుకోవచ్చని తెలిపింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఫార్మసీల ద్వారా జనవరి 1 నుంచి 18-25ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత ఉచిత కండోమ్‌లను పొందవచ్చు అని ప్రకటించారు. లైంగిక సంబంధ వ్యాధులను, జనాభా నియంత్రణను దృష్టిలో పెట్టుకునే ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 2020, 2021 సంవత్సరాల్లో లైంగిక వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య 30శాతం పెరిగిందని తెలుస్తుంది.