Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దాదాపు 100 మందితో వచ్చి సినీ ఫక్కీలో యువతిని ఎత్తుకెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముచ్చర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపతుల కుమార్తె ముచ్చర్ల వైశాలి. వైశాలి డెంటల్ డాక్టర్. వీరు తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ సిరి టౌన్ షిప్ లో నివసిస్తున్నారు. అయితే, నవీన్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద ఎత్తున యువకులను వెంటేసుకుని వచ్చి వైశాలిని కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో అక్కడ విధ్వంసం సృష్టించారు. ఇంట్లోని ఫర్నిచర్ ను, వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డొచ్చినవారిపై దాడికి పాల్పడ్డారు.
గతంలో నవీన్ రెడ్డి, వైశాలి ప్రేమించుకున్నారు. వైశాలిని పెళ్లి చేసుకుంటానని నవీన్ రెడ్డి చెప్పగా, ఆమె కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదని వెల్లడైంది. ఈ తరుణంలో వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసినట్టు భావిస్తున్నారు. అయితే వైశాలికి ఇటీవలే మరో యువకుడితో నిశ్చితార్థం జరిగగా, మరికొన్నిరోజుల్లో పెళ్లి జరగనుండగా, ఈ కిడ్నాప్ చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.