Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ రోజు అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున మాండూస్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఈ తుఫాన్ కారణంగా ఉమ్మడి చిత్తూరుతో పాటు నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. తుఫాన్ వల్ల ప్రభావితం అయ్యే జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాండూస్ తుఫాన్ ప్రభావంతో సముంద్రం అల్లకల్లోలంగా ఉంది. కాకినాడ జిల్లా తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం పది మీటర్లు ముందుకు వచ్చింది.నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి తెలిపారు. సంబంధిత పాఠశాలలు కళాశాలలు వాటి యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలని లేనిచో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.