Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో విరాజిల్లిన బౌద్ధమత ఖ్యాతికి నిదర్శనంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగార్జున సాగర్‌లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కు ఇంటర్నేషనల్ అవార్డు దక్కడం విశేషం.
అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ ఏటా అందిస్తున్న బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ దేశాల టూరిజం మిత్ర అవార్డును అందుకుంది. కోల్‌కతాలోని సిటీ సెంటర్ సాల్ట్ లేక్ సీఐ హాల్ లో ఈ అవార్డును అందజేశారు. కొరియా ఇండియా ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ చైర్మన్ భిక్షు దమ్మ దీప చేతుల మీదుగా బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఈ అవార్డును అందుకున్నారు. బౌద్ధ శిల్పకళ, బౌద్ధ సంస్కృతి పరిరక్షణ, శాంతిని పెంపొదించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదం చేస్తోందని అధికారులు తెలిపారు.