Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 2011 నుంచి 2016 వరకు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించిన మిగ్నాన్ డు ప్రీజ్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు విడ్కోలు పలికింది. తాజగా టీ20ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక డు ప్రీజ్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రంమే ఆడనుంది. ఈ ఏడాది బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో డు ప్రీజ్ చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడింది.
తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 114 టీ20లు ఆడిన డు ప్రీజ్ 1805 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లలో 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆమె వన్డే, టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వన్డేలు ఆడిన మహిళా క్రికెటర్ కూడా డు ప్రీజ్ కావడం విశేషం. ఆమె తన వన్డే కెరీర్‌లో 154 మ్యాచ్‌లు ఆడిన డు ప్రీజ్ 3760 పరుగులు సాధించింది. తన కెరీర్‌లో 18 అర్ధ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి.