Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది. గతంలో ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 11 చివరి తేదీ కాగా.. దానిని 20వ తేదీ వరకు పెంచినట్లు ఆ విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 26 వరకు రూ.50, 27 నుంచి జనవరి 2 వరకు రూ.200, 3 నుంచి 9 వరకు రూ.500 అపరాధ రుసుముతో కలిపి చెల్లించవచ్చని వివరించారు.