Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం: ఖమ్మంలోని జడ్పీ సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమంచి పోలీసు స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న గోధుమల సుధాకర్(54) పాత బస్టాండ్ వైపు వెళ్తుండగా జడ్పీ సెంటర్‌లో రాంగ్‌రూట్‌లో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు ఏఎస్సై బైక్‌ను ఎదురుగా ఢీకొన్నాడు. కిందపడిపోయిన సుధాకర్ తలకు బలమైన గాయమైంది. స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. యువకుడు అక్కడ ఆగకుండా పారిపోయాడు. పోలీసులు సీసీ పుటేజి ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. దీనిపై ఒకటో పట్టణ ఠాణా ఎస్సై కె.వెంకటేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుధాకర్ 1989 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఖమ్మం నగరంలోని నెహ్రూనగర్‌లో నివాసముంటున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.