Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మాండూస్ ముప్పు ముంచుకొస్తున్నది. తుఫానుగా మారిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మామల్లాపురం సమీపంలో తీరం దాటింది. ఇది శనివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో నెల్లూరు, ప్రకారం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో మైపాడు తీరం అల్లకల్లోలంగా మారింది. ఇక తిరుమలపై మూండూస్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.