Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: మాండస్ తుఫాన్ తీరం దాటనుండటంతో చెన్నై సహా మూడు జిల్లాలకు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారి బాలచంద్రన్ ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... మాండస్ తుపాను మహాబలిపురం వద్ద తీరం దాటనుందని, ఆ కారణంగా చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కుండపోతగాను, మోస్తరుగాను వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గత వందేళ్ల చరిత్రలో ఫుదుచ్చేరి, శ్రీహరి కోట మధ్య మహాబలిపురానికి చేరువుగా 12 తుఫానులు తీరం దాటాయని, ఆ క్రమంలో మాండస్ 13వదని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో మాండస్ తుపాను మహాబలిపురానికి 135 కి.మీ. దూరంలో ఉందని, గంటకు 10. కి.మీ. వేగంతో తీరం వైపు కదులుతోందని చెప్పారు. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 80 నుండి 85 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచే అవకాశం కూడా ఉందని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేశారు.