Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గువాహటి: అసోంలోని గువాహటిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి నగరంలోని ఫటాసిల్ అంబారి ప్రాంతంలో ఉన్న మురికివాడలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కన ఉన్న గుడిసెలకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఇండ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే పెద్ద సంఖ్యలో ఇండ్లు, లక్షల్లో నగదు కాలిపోయాయి. కాగా, సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.