Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ యువ హీరో సత్యదేవ్ టాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. చిన్న క్యారెక్టర్ పాత్రలతో తన కెరీర్ ను ప్రారంభించి, లీడ్ రోల్స్ చేసే స్థాయికి ఎదిగాడు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం అని చెప్పుకునే సత్యదేవ్... 'గాడ్ ఫాదర్' సినిమాలో ఆయన పక్కన నటించడం తన అదృష్టమని పలు మార్లు చెప్పాడు. మరోవైపు తన జీవితంలో ఎదురైన ఒక భయానక అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నాడు. ఓ సినిమా షూటింగ్ కోసం ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లినప్పుడు ఈ అనుభవం ఎదురైందని సత్యదేవ్ తెలిపాడు. ఆఫ్ఘాన్ లో షూటింగ్ పూర్తి చేసుకుని వస్తుండగా ఎయిర్ పోర్టులో తనను సూసైడ్ బాంబర్ అనుకుని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పాడు. సూసైడ్ బాంబర్స్ కాలికింద ట్రిగ్గర్ పెట్టుకుని అవసరమైనప్పుడు ఆపరేట్ చేస్తారని ఎయిర్ పోర్టులో తన పక్కన కూర్చున్న వ్యక్తి తన కాలు కింద ఉన్న దేన్నో తీయడానికి ప్రయత్నిస్తున్నాడని దీంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంటనే ఆయనను, పక్కనున్న తనను అరెస్ట్ చేశారని తెలిపాడు. అయితే తమ చిత్ర బృందం వచ్చి తాము షూటింగ్ కోసం వచ్చామని చెప్పడంతో వదిలేశారని చెప్పాడు.