Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కుటుంబసభ్యులతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని డిపో మెకానిక్ చనిపోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో జరిగింది. సింగాయిపల్లికి చెందిన వెంకటేశ్(43) హకీంపేట ఆర్టీసీ డిపోలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం భార్య, ముగ్గురు పిల్లలు, బంధువులైన మరో ముగ్గురు మహిళలతో కలిసి కారులో మేడ్చల్ పరిధి మునీరాబాద్ సమీపంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి బయలుదేరాడు. హకీంపేట డిపో వద్దకు రాగానే ప్రజ్ఞాపూర్ నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటేశ్ అక్కడిక్కడే మృతి చెందగా.. అతడి భార్యాపిల్లలు, ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని అల్వాల్లోని ఓ హాస్పిటల్కు తరలించారు. తాను పనిచేసే డిపో దగ్గరే ప్రమాదం జరిగి వెంకటేశ్ ప్రాణాలు కోల్పోవడం తోటి కార్మికుల్లో విషాదాన్ని నింపింది.