Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చేవూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వృద్ధుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో క్రేన్ సాయంతో మృతులను కారులో నుంచి వెలికితీశారు. మృతులను నందిపేటకు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రుడిని దవాఖానకు తవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.