Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పన్నెండేళ్ల తర్వాత ఇండియన్ టెస్టు జట్టులోకి జయదేవ్ ఉనద్కత్‌కు మళ్లీ పిలుపు వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు మ్యాచ్‌లో అతను ఆడనున్నాడు. బౌలర్ షమీ గాయపడడంతో.. అతని స్థానంలో ఉనద్కత్‌ను తీసుకున్నారు. ఇటీవల విజయ హజారే ట్రోఫీ విజయంలో సౌరాష్ట్ర తరపున అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు జయదేవ్. ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఉన్న అతను.. చట్టోగ్రామ్ వెళ్లేందుకు వీసా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. షమీ చేతికి గాయం కావడం వల్ల అతను సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. బంగ్లాదేశ్‌తో ఇండియా రెండు టెస్టులు ఆడనున్నది. 31 ఏళ్ల ఉనద్కత్ తొలిసారి 2010లో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇటీవల ముగిసిన విజయ హజారే టోర్నీలో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ అత్యధికంగా 19 వికెట్లు తీసుకున్నాడు.