Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడవ వన్డేలో తొలుత ఇండియా బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన బంగ్లా.. ముందుగా బౌలింగ్ ఎంచుకున్నది. ఇండియా జట్టులో రెండు మార్పులు చేశారు. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్‌లు జట్టులోకి వచ్చారు. బంగ్లా జట్టు కూడా రెండు మార్పులు చేసింది. టస్కిన్, యాసిర్ అలీలు జట్టులోకి వచ్చారు. మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే బంగ్లాదేశ్ 2-0 తేడాతో కైవసం చేసుకున్నది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ఓదార్పు విజయాన్ని సొంతం చేసుకోవాలని భారత జట్టు చూస్తోంది.