Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రయాణికుల సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వ ఫేమ్ -2 పథకంలో భాగంగా సీఈఎస్ఎల్ ద్వారా కొత్తగా రాజధాని బెంగళూరు నగరం కోసం 921 ఎలక్ట్రికల్ బస్సుల ను కొనుగోలు చేసేందుకు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్ తెలిపింది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బస్సుల కొనుగోలు ఖర్చులో కొంత భరించనుంది. ఒక్కో ఎలక్ట్రికల్ బస్సు ధర రూ 1.50 కోట్లుగా ఉంటుందని ఇందులో కేంద్రం ప్రతిబస్సుకు రూ 39.08 లక్షలు భరించనుండగా మిగిలిన మొత్తాన్ని సీఈఎస్ఎల్ కంపెనీ సమకూర్చుకోనుంది. బీఎంటీసీ ఆధ్వర్యంలో ఈ బస్సుల సంచారం జరగనుంది.