Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. యువ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. కోహ్లీతో కలిసి బంగ్లా బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ షాట్లతో ఇషాన్ సెంచరీ సాధించాడు. కేవలం 126 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు. ఇందులో 9 సిక్స్ లు, 23 ఫోర్లు ఉన్నాయి. ఈక్రమంలో ఇషాన్ ఔట్ కావడంతో ఒక మెరుపు ఇన్నింగ్స్ కు తెరపడింది.
మొత్తం 131 బంతులను ఎదుర్కొన్న ఇషాన్ 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులకు ఔట్ అయ్యాడు. మరోవైపు కోహ్లీ 91 బంతులకు 113 చేయగా, శ్రేయస్ అయ్యర్ 3 పరుగులతో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సుందర్, పటేల్ క్రీజులో ఉన్నారు. ఈ తరుణంలో భారత్ స్కోరు 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 366 పరుగులతో కొనసాగుతుంది.