Authorization
Fri May 16, 2025 07:02:51 pm
హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన హైదరాబాద్ శివారు మన్నెగూడలో శుక్రవారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై యువతి తండ్రి దామోదర్‌రెడ్డి ఫిర్యాదుతో ఆదిభట్ల పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘటన గురించి తెలుసుకున్నప్పటి నుంచి ఆమె ఆహారం తీసుకోవడం లేదు అనంతరం నారాయణమ్మ మీడియాతో మాట్లాడుతూ నా కుమారుడు ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చాడు. నా కొడుకు, ఆ యువతి రెండేళ్లుగా స్నేహంగా ఉన్నారు. ఆ అమ్మాయి చాలాసార్లు మా ఇంటికి వచ్చింది. కరోనా సమయంలో అమ్మాయిని నిత్యం కారులో కళాశాల వద్ద నా కొడుకే దింపేవాడు. యువతిని పెళ్లి చేసుకున్నట్లు నవీన్ మాకు చెప్పాడు.
నవీన్ రెడ్డి తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులు సైతం యువతి తండ్రి దామోదర్ రెడ్డికి ఇచ్చేవాడు. నిన్న యువతి ఇంటిపై దాడి చేయడం తప్పే. కానీ, అంతకుముందు జరిగిన విషయాలను పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలి. నవీన్ రెడ్డి వ్యాపారం కోసం చాలా కష్టపడేవాడు. ఒక్కోసారి పది రోజులు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. అంత కష్టపడి పైకి ఎదిగిన నా కుమారుడిని యువతి ఎంతో ఇష్టపడింది అని నారాయణమ్మ తమ బాధను పంచుకున్నారు.