Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ ఎల్) మరోసారి హైదరాబాద్ లో జరగనున్నాయి. ఐఆర్‌ఎల్ ఫస్ట్ ఎడిషన్‌లో చివరి, నాలుగో రౌండ్ పోటీలు శని, ఆదివారాల్లో హుస్సేన్ సాగర్ తీరంలోని హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌లో జరుగుతాయి. అయితే రెండో, మూడో రౌండ్ పోటీలను మాత్రం చెన్నైలో షెడ్యూల్ ప్రకారం పూర్తి చేశారు. ఈ రెండు రౌండ్లలో సత్తా చాటిన హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ మొత్తంగా 301.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
రెండో స్థానంలో ఉన్న గాడ్ స్పీడ్ కొచి ఖాతాలో 242.5 పాయింట్లు మాత్రమే ఉన్న క్రమంలో ఫస్ట్ సీజన్‌లో హైదరాబాద్ విజయం దాదాపు ఖాయం అయింది. అయుతే తొలి రౌండ్‌లో పోటీ రద్దయిన ట్రాక్‌పై చివరి రౌండ్ ను ఏ విధంగా నిర్వహించనున్నారో చూడాలి. దీనిలో భాగంగా ఆదివారం రేసు ముగిసిన తర్వాత సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 వరకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డ్రమ్స్ శివమణితో లైవ్ ఈవెంట్ ఏర్పాటు చేసినట్టు ఆర్గనైజర్స్ తెలిపారు.