Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అందింది. డిసెంబరు 12 నుంచి జనవరి 12 వరకు నెలరోజుల పాటు ఈ బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లోని గ్రేడ్-2 హెడ్మాస్టర్లు కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, సాధారణ ఉపాధ్యాయుల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని తెలిపింది. బదిలీల ప్రక్రియను ఆన్ లైన్ దరఖాస్తు, వెబ్ కౌన్సిలింగ్ విధానంలో నిర్వహించనున్నారు.
ఈ తరుణంలో బదిలీల కారణంగా 2022-23 విద్యాసంవత్సరం ఒడిదుడుకులకు లోనవకుండా చూడాలని పాఠశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఉన్నతాధికారులతో రెండ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ల బదిలీలకు ఆమోదం తెలిపారు. ఈ నెల 12వ తేదీ లోపు ప్రకటన విడుదల చేసి, నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.