Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శనివారం మధ్యాహ్నం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. రూ. 1.38 కోట్ల విలువైన 2.961 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని తరువాత శంషాబాద్ పోలీసులకు అతన్ని అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.