Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రం పరిధిలోని కోల్‌బెల్ట్ ఏరియాలో నివసించే ఒక యువకుడు చేసిన పని ఓ బైక్ షోరూం నిర్వాహకులను ఆశ్చర్యపరిచింది. దాదాపు వందకు పైగా సంచుల్లో నాణేలు ఇచ్చి తన కలల బైక్‌ను సొంతం చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ తారకరామ కాలనీకి చెందిన వెంకటేశ్ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేశాడు.
స్పోర్ట్స్ బైక్‌పై తిరగాలన్నది అతని కోరిక కావడంతో అందుకోసం దాచుకున్న చిల్లర డబ్బును తీసుకుని గురువారం జిల్లా కేంద్రంలోని ఓ బైక్ షోరూంకి వెళ్లాడు. 112 సంచు(సీల్డ్ కవర్లు)ల్లో తెచ్చినకా చిల్లరంతా లెక్కించిన తర్వాతే బైక్ అందిస్తామని వాళ్లు తెలిపారు. దీంతో పదిహేను మంది సిబ్బంది గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నాణేలు లెక్కించగా అవి రూ.2.85 లక్షల రూపాయి విలువగా తేలడంతో విలువైన స్పోర్ట్స్ బైక్‌ను వెంకటేశ్‌కు అందించారు.