Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మూడో వన్డేలో భారత జట్టు ఘన విజయాన్ని సోంతం చేసుకుని, 227 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై భారీ రికార్డు నమోదు చేసింది. ముస్తాఫిజుర్‌ను ఉమ్రాన్ మాలిక్ బౌల్డ్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 410 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా ఆటగాళ్లు ఆది నుంచి తడబడ్డారు.
నాలుగో ఓవర్‌లో అక్షర్ పటేల్ ఓపెనర్ అనాముల్ హక్ (8 రన్స్)ను అవుట్ చేశాడు. ఆ వెంటనే లిట్టన్ దాస్ (29 పరుగులు)ను సిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మిడిలార్డర్‌లో షకిబుల్ హసన్, ముష్ఫికర్ రహీంలు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, షకిబుల్ (43 పరుగులు)కు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో బంగ్లా ఒత్తిడిలో పడింది. శార్థూల్ ఠాకూర్ కీలకమైన మెహిదీ హసన్ మిరాజ్ వికెట్ తీయడంతో బంగ్లా ఓటమి దాదాపు ఖరారైంది. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు తీశారు. సిరాజ్, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.