Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ నూతన మంత్రివర్గంలో ఐదుగురు భారత సంతతి వ్యక్తులకు తాజాగా చోటు దక్కింది. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ ప్రభుత్వ ప్రీమియర డేవిడ్ ఈబై ఇటీవల చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఐదుగురు ఎన్నారైలకు ఈ సువర్ణావకాశం లభించింది. అటార్నీ జనరల్‌గా నికీ శర్మ, విద్య, శిశు సంరక్షణ శాఖ మంత్రిగా రచనా సింగ్, హౌసింగ్ శాఖ, శాసనసభాపక్షనేతగా రవీ కహ్లాన్, వాణిజ్య శాఖ మంత్రిగా జగ్‌రూప్ బ్రార్, కార్మిక శాఖ మంత్రిగా హార్రీ బెయిర్స్ ఎంపికయ్యారు.
కొత్త మంత్రివర్గంలో 23 కేబినెట్ మంత్రులు, నలుగురు సహాయ మంత్రులు, 14 పార్లమెంటరీ సెక్రెటరీలు ఉన్నారు. ఇక కెనడాలో హింసాత్మక నేరాలు పెరుగుతున్న తరుణంలో నికీ శర్మ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు.