Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంగ్లాదేశ్‌పై మూడవ వన్డేలో టీమిండియా 227 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. తరుణంలో 85 బంతుల్లో మొదటి సెంచరీ పూర్తిచేసిన ఇషాన్ కిషన్ 23 బౌండరీలు, 9 సిక్సర్ల సాయంతో 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ ముగించేసి టీమిండియా విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పలు రికార్డులను బ్రెక్ చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వరల్డ్ రికార్డును ఇషాన్ కిషన్ తుడిపేశాడు.
2015 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై క్రిస్ గేల్ 138 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. జింబాబ్వేపై కేవలం 128 బాల్స్‌లోనే డబుల్ సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ గేల్ రికార్డును అధిగమించాడు. ఏకంగా 12 బాల్స్ ముందుగానే డబుల్ సెంచరీ బాదేసి శెబాష్ అనిపించుకున్నాడు. మరోవైపు డబుల్ సెంచరీ కొట్టిన పిన్నవయస్కుడిగానూ కిషన్ రికార్డ్ నెలకొల్పాడు. వన్డేల్లో భారత్ తరపున డబుల్ సెంచరీలు సాధించిన సచిన్ తెందుల్కర్, విరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మల జాబితాలో ఇషాన్ కిషన్ చేరాడు. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన 7వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. భారత ఆటగాళ్లు మినహా డబుల్ సెంచరీలు కొట్టిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్, వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్, పాకిస్తాన్ క్రికెటర్ ఫఖార్ జమాన్ ఉన్నారు. రోహిత్ శర్మ ఒక్కడే ఏకంగా మూడు డబుల్ సెంచరీలు కొట్టడం విశేషం.