Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడు తీసుకొస్తున్న బంగారం బిస్కెట్లు, ఆభరణాలను శనివారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి ఎఫ్‌జెడ్ 461 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో 2.961 కిలోల బంగారం బయటపడింది. ఇందులో 1,547 గ్రాముల 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లు, 1,414 గ్రాముల 18 క్యారెట్ల బంగారు ఆభరణాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.1,37,92,968 ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.