Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లించే డీఎను 40.2శాతం పెంచుతూ కోల్‌ఇండియా యజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సింగరేణి, సీఐఎల్‌లలో పనిచేస్తున్న బొగ్గుగని కార్మికులకు 10వవేజ్‌బోర్డు ప్రకారం 40.2శాతం మేరకు డీఏ పెంచినట్లు ఆదేశాలలో పేర్కొంది. ఈ నిర్ణయం 1-12-2022నుంచి 28-2-2023ల వరకు మూడు నెలలపాటు వర్తించనున్నట్లు కోల్‌ఇండియా యజమాన్యం ప్రకటించింది. సింగరేణి కార్మికులు ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే డీఎను పెంచినట్లు ఏఐటీయుసీ సెంట్రల్ డిప్యూటీ ప్రధానకార్యదర్శి కే. సారయ్య, ఇల్లెందు డివిజన ఉపాధ్యక్షుడు ఎస్వీ రమణ హర్షం వ్యక్తం చేశారు. డీఎ పెరిగిన విషయాన్ని కార్మికులు గమనించాలని సూచించారు.