Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలపై మాండౌస్ తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. ఈదురు గాలులకు తోడు భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కూలాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రహదారులపైకి నీళ్లు చేరడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీకాళహస్తి-తడ మార్గంలో సున్నపుకాల్వపై బస్సు ఇరుక్కుపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్-రేణిగుంట-ఇండిగో విమానం రద్దయింది.