Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాంటియాగో: చిలీలోని ఆండిస్ పర్వతాలలో ఉన్న లాస్కర్ అగ్నిపర్వతం బద్దలైంది. భారీగా పొగ, ధూలి, విషవాయువులను వెదజల్లుతున్నది. దీంతో ఆకాశంలో 6000 మీటర్ల ఎత్తువరకు దట్టమైన పొగ కమ్ముకున్నది. శనివారం మధ్యాహ్నం 12.36 గంటలకు విస్పోటనం చెందిందని నేషనల్ జియాలజి అండ్ మైనింగ్ సర్వీస్ తెలిపింది. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు స్వల్పంగా భూమి కంపించిందని వెల్లడించింది. అగ్నిపర్వతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్బ్రే పట్టణంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అండిస్ పర్వత శ్రేణుల్లో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాల్లో లాస్కర్ ఒకటి. ఇది 5,592 మీటర్ల ఎత్తు ఉన్నది. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నది. ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 1993లో పేలింది. 2006, 2015లో కూడా స్వల్పంగా లావాను వెదజల్లింది.