Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భద్రాద్రి జిల్లా పినపాక మండలంలోని చినరాజుపేట గ్రామంలో శనివారం ఓ యువరైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. చిన్నరాజుపేట గ్రామానికి చెందిన ఊసం తిరుపతమ్మ, ఆదినారాయణ దంపతులు చిన్న కుమారుడు విష్ణువర్ధన(22) శనివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఇంటికి సమీపంలో ఉన్న తమ పొలంలో యాసంగి పంట కోసం వేసిన వరినారుమడికి నీరుపెట్టేందుకు వెళ్లాడు. దారినిక నీరు పెట్టిన తరువాత మరికొంత దూరంలో ఉన్న తమ మూడు ఎకరాల మిరప తోటకు నీరు పెట్టేందుకు వెళ్లి మోటార్ ఆనచేసే క్రమంలో ఫీజులను పెడుతుండగా విద్య్‌తషాక్‌కు గురయ్యాడు. దీంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని పినపాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అవివాహితుడైన విష్ణువర్ధన గ్రామంలో అందరితో ఎంతో స్నేహభావంతో మెలిగేవాడు కావడంతో అనుకోని విధంగా విద్యుతషాక్‌తో అతడు మృతిచెందడటంలో గ్రామంలో విషాదం అలుముకుంది. చిన్న కుమారుడు అకాల మృతిని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఇంటర్ వరకు చదువుకున్న విష్టువర్ధన తల్లిదండ్రులకు పొలం పనుల్లో సాయంగా ఇంటి వద్ద ఉంటున్నాడు. చేతికందిన కుమారుడు తమను వీడిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగ ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.