Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పిల్లల్ని పోషించడం కోసం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పడం లేదు. తల్లిదండ్రులు తీరిక లేకుండా పని చేస్తుండటంతో పిల్లలు వారి ప్రేమాదరాలకు నోచుకోలేకపోతున్నారు. అందుకే ఓ ఆరేళ్ళ చిన్నారి తన తల్లికి ఉద్యోగం పోయిందంటే చాలా సంతోషపడింది. మనిద్దరం ఎక్కువసేపు గడపవచ్చునని ఆనందంతో చిందులు వేసింది. షెల్లీ కలిష్ గత ఏడాది జూన్ నెలలో ఫేస్‌బుక్‌లో ఉద్యోగంలో చేరారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో చిన్న కుమార్తె వయసు ఆరేళ్ళు. మెటా గత నెలలో దాదాపు 11,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆ విధంగా ఉద్యోగాన్ని కోల్పోయినవారిలో షెల్లీ ఒకరు. మెటా యజమాని మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయంతో చాలా మంది మేనేజర్లు హతాశులయ్యారు. కొందరిని తొలగిస్తారనే విషయం ముందుగానే తెలిసినప్పటికీ, కళ్ళ ముందు ప్రపంచం కనిపించనంత అంధకారం అలముకుంది.