Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: భార్యపై అనుమానంతో కుమార్తెకు రెండోసారి డీఎన్‌ఎ పరీక్షలు జరిపించాలని పిటీషన్ దాఖలు చేసిన భర్త తీరుపై హైకోర్టు ధర్మాసనం మండిపడింది. మరోసారి పరీక్షలకు ససేమిరా అంటూ పిటీషన్‌ను తిరస్కరించింది. భార్యపిల్లలను పర్యవేక్షించకుండా తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఉందంటూ న్యాయమూర్తి ఎం. నాగప్రసన్న ధర్మాసనం మండిపడింది. బెంగళూరు నగరం కెంగేరి హోబళి ఆగర గ్రామానికి చెందిన పిటీషనర్‌కు 2010 మేనెలలో వివాహమయింది. 2011 సెప్టెంబరులో దంపతులకు కుమార్తె జన్మించింది. తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. విచారణ లు సాగుతుండగానే భర్త పితృత్వ పరీక్షలు జరిపించాలని మధ్యంతర పిటీషన్ దాఖలు చేశారు. భార్య అంగీకారం మేరకు కోర్టు రక్త నమూనాలను సేకరించి బెంగళూరు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ నుంచి వచ్చి నివేదికలో చిన్నారి తండ్రి పిటీషనర్ అంటూ తేలింది. దీంతో మరోసారి పిటీషనర్ కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ డీఎన్‌ఎ శాంపిల్స్ పరీక్షలు జరిపించాల్సి ఉందని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్‌ను స్వీకరించిన ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. దీంతో మరోసారి అర్జీదారుడు హైకోర్టును ఆశ్రయించిన మేరకు శుక్రవారం ధర్మాసనం విచారణల వేళ పలు అంశాలను ప్రస్తావించారు. పిటీషనర్ తీరును ధర్మాసనం తప్పుపట్టింది.